: గుజరాత్ తీరంలో మరో పాక్ బోటు... 8 మంది అరెస్ట్


పాకిస్థాన్ నుంచి డ్రగ్స్, శాటిలైట్ ఫోన్లతో గుజరాత్ తీర పట్టణం పోర్ బందర్ కు వస్తున్న ఓ పడవను ఇండియన్ నావీ, కోస్ట్ గార్డ్స్ బృందం సంయుక్త ఆపరేషన్ తో పట్టుకున్నాయి. ఈ బోటు నుంచి పెద్దఎత్తున డ్రగ్స్, శాటిలైట్ ఫోన్లను అధికారులు సీజ్ చేశారు. అయితే, ఉగ్రవాద లింకులను మాత్రం అధికారులు కొట్టి పారేశారు. మొత్తం 8 మంది ఈ బోటులో వచ్చారని, వీరందరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని తెలిపారు. మొత్తం 140 కిలోల హెరాయిన్ ఈ పడవలో స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ బోటు గత కొద్ది రోజులుగా అంతర్జాతీయ జలాల్లో తిరుగుతుండడాన్ని ముందే పసిగట్టిన నిఘా వర్గాలు, ఆ బోటు భారత జలాల్లోకి వచ్చే వరకూ వేచి ఉండి, ఆపై చుట్టు ముట్టి బంధించినట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News