: 60 ఏళ్ల వయసులోనూ కేసీఆర్ యువకుడిలా పని చేస్తున్నారు: కేటీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను యువకుడంటూ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ సంబోధించారు. 60 సంవత్సరాల వయసులోనూ ఆయన యువకుడిలా పని చేస్తున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ నాయకత్వంలోనే తామంతా పని చేస్తున్నామని, పార్టీ అధ్యక్ష పదవికి ఆయనే సమర్థుడని ఉద్ఘాటించారు. టీఆర్ఎస్ అధ్యక్షుడిగా మరోసారి కేసీఆర్ ఎన్నికైన సందర్భంగా కేటీఆర్ మీడియాతో పైవిధంగా స్పందించారు. పార్టీని, ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నిర్వహించే సత్తా కేసీఆర్ కు ఉందన్నారు. ఆయనిప్పటికే 'వర్కింగ్' (కార్యనిర్వహణ)లో ఉన్నారని, ప్రత్యేకంగా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు అవసరం లేదని స్పష్టం చేశారు.