: పాక్ లో నలుగురు కామాంధులకు ఉరి


అత్యాచారాలకు పాల్పడిన వారికి అత్యంత కఠిన శిక్షలు విధించే పాకిస్తాన్ నేడు ఇద్దరు రేపిస్టులకు ఉరిశిక్ష అమలు చేసింది. రేపు మరో ఇద్దరిని ఉరితీయనుంది. గతంలో వీరికి మరణశిక్షను ఖరారు చేయగా, వీరు పెట్టుకున్న క్షమాభిక్ష తిరస్కరణకు గురికావడంతో ఉరిశిక్షను అమలు చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ ఉదయం ఇద్దరు దోషులు సలీమ్, నౌమన్ లకు సియల్ కోట్ జిల్లా జైలులో అధికారులు ఉరిశిక్షను అమలు చేసినట్టు తెలుస్తోంది. అలాగే మరో ఇద్దరు దోషులు అబిద్ మసూద్, సన్హుల్లాలకు బుధవారం ఉరి శిక్షను అమలు చేయనున్నట్టు అధికారులు తెలిపారు. 1999లో మైనర్ పై సామూహిక అత్యాచారం చేసిన కేసులో సలీం, నౌమన్ లకు, 1997లో 15 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం చేసినందుకు అబిద్, నన్హుల్లాలకు కోర్టు మరణశిక్ష విధించింది. ఆ తరువాత పాక్ లో ఉరి అమలుపై నిషేధం మొదలవగా, వీరు దీర్ఘకాలంపాటు జైల్లో గడపాల్సి వచ్చింది. గత డిసెంబర్లో పెషావర్లోని ఆర్మీ పాఠశాలపై ఉగ్రవాదుల కాల్పుల అనంతరం ఉరిశిక్ష అమలుపై ఉన్న నిషేధాన్ని పాకిస్థాన్ ఎత్తివేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News