: లంక మాజీ అధ్యక్షుడు రాజపక్సేపై అవినీతి ఆరోపణలు... సమన్లు జారీ చేసిన విచారణ కమిషన్


గోరుచుట్టుపై రోకటి పోటు అంటే ఇదేనేమో! ఇప్పటికే అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి తప్పదని, ఫలితాలు వెల్లడి కాకముందే అధ్యక్ష భవనం నుంచి పరారైన శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహీంద రాజపక్సే ఇంకా ఆ షాక్ నుంచి కోలుకోనే లేదు. అప్పుడే, ఆ దేశ అవినీతి ఆరోపణల విచారణ కమిషన్ ఆయనకు సమన్లు జారీ చేసింది. ‘‘మీపై వెల్లువెత్తిన అవినీతి ఆరోపణలపై విచారణ చేపట్టదలచాం. ఈ నెల 24న మీరు మా ముందు హాజరు కావాల్సిందే’’ అంటూ కమిషన్ సదరు సమన్లలో రాజపక్సేకు ఆదేశాలు జారీ చేసింది.

  • Loading...

More Telugu News