: ఈ దొంగలకు భారీ వేతనాలు!


సంచలనం సృష్టించిన కార్పొరేట్ కుంభకోణంలో ప్రభుత్వ కార్యాలయాల నుంచి వివిధ సీక్రెట్ పత్రాలను లీక్ చేసిన వారికి కార్పొరేట్ సంస్థలు భారీ మొత్తాన్ని నెలవారీ వేతనం కింద చెల్లించేవని పోలీసులు తమ చార్జిషీట్‌ లో పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి చార్జిషీట్‌ ను కోర్టుకు సమర్పించారు. లల్తా ప్రసాద్, రాకేష్ కుమార్ అనే కార్పొరేట్ గూఢచారులకు నెలకు రూ. 2.5 లక్షలు వేతనంగా అందేదని వివరించారు. ఈ మొత్తాన్ని రిలయన్స్ కు చెందిన శైలేష్ సక్సేనా, ఎస్సార్‌ ఆయిల్స్ కు చెందిన వినయ్ కుమార్, కెయిర్న్ ఇండియా నుంచి కేకే నాయక్, జుబిలంట్ ఎనర్జీకి చెందిన సుభాష్ చంద్ర, అనిల్ అంబానీ నేతృత్వంలోని అడాగ్ గ్రూప్ ఉన్నతోద్యోగి రిషి ఆనంద్‌, ఎనర్జీ కన్సల్టెంట్ కు చెందిన ప్రయాస్ జైన్, జర్నలిస్ట్ శంతను సైకియాలు చెల్లించేవారని పోలీసులు పేర్కొన్నారు. తమ వ్యాపార లావాదేవీల కోసం ఆ నిందితులకు ప్రతినెలా చెల్లింపులు జరిపే వారమని ఆయా కంపెనీల ఎగ్జిక్యూటివ్‌ లు తమ విచారణలో అంగీకరించారని వివరించారు.

  • Loading...

More Telugu News