: అమూల్ డైరీ చైర్మన్ ప్లాట్లో భారీగా అక్రమ మద్యం స్వాధీనం


దేశంలో ప్రసిద్ధిగాంచిన అమూల్ డైరీకి చైర్మన్ గా వ్యవహరిస్తున్న రామ్ సింగ్ పర్మార్ కు చెందిన ప్లాట్లో కేసుల కొద్దీ అక్రమ మద్యం పట్టుబడింది. గుజరాత్ లోని థస్రా పట్టణంలోని ఆయనకు చెందిన స్థలంలో పోలీసులు ఆదివారం నాడు దాడులు నిర్వహించారు. రూ.4.8 లక్షల విలువ చేేసే 2023 బీరు బాటిళ్లు, 18 బాక్సుల భారత తయారీ విదేశీ మద్యం (రూ.48 వేలు) ఈ సందర్భంగా స్వాధీనం చేసుకున్నారు. ఓ వాహనంలోంచి ఈ మద్యాన్ని అన్ లోడ్ చేస్తున్న ముగ్గురిని అరెస్టు చేశారు. వారిలో ఓ మైనర్ కూడా ఉన్నాడు. ఆ బాలుడు ఐదో తరగతి విద్యార్థి కావడం గమనార్హం. కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిన పర్మార్ ను ఈ విషయమై ప్రశ్నించగా, అమూల్ డైరీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తనపై జరిగిన రాజకీయ కుట్ర అని ఆరోపించారు. తాను మద్యం తాగనని, మద్యపానానికి వ్యతిరేకమని స్పష్టం చేశారు. అలాంటప్పుడు అంత భారీ స్థాయిలో మద్యం నిల్వ చేయాల్సిన అవసరం తనకేంటని ప్రశ్నించారు. పట్టుబడిన మద్యం తన ప్లాట్ వెలుపలే స్వాధీనం చేసుకున్నారని, వాహనం తనకు సంబంధించినది కాదని తెలిపారు.

  • Loading...

More Telugu News