: తమిళనాడులో ఏపీ పోలీసుల దాడులు... 167 ఎర్రచందనం దుంగలు స్వాధీనం


తమిళనాడులో ఏపీ పోలీసులు దాడులు నిర్వహించారు. చెన్నైలో చిత్తూరు జిల్లా పోలీసులు నిర్వహించిన ఈ దాడుల్లో 167 ఎర్రచందనం దుంగలు (3.5 టన్నులు) స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో ఎర్రచందనం స్మగ్లర్ శరవణన్ ను అరెస్టు చేశారు. పలు చోట్ల ఈ దాడులను నిర్వహించారు. కొన్ని చోట్ల ఏపీ పోలీసులను స్మగ్లర్లు అడ్డుకునేందుకు యత్నించారు. ఎర్రచందనం అక్రమరవాణాపై ఏపీ సర్కారు ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే శేషాచలం అడవుల్లో 20 మంది ఎర్రచందనం కూలీలను ఎన్ కౌంటర్ చేశారు.

  • Loading...

More Telugu News