: కోహ్లీ ప్రేయసికి ప్రీతీ జింతా సీరియస్ సలహా
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ ముద్దుగుమ్మ అనుష్క శర్మల ప్రేమాయణం ఇప్పుడు బహిరంగం. ఎయిర్ పోర్టులు, క్రికెట్ గ్యాలరీలు, షూటింగ్ స్పాట్లు... ఇలా పలు చోట్ల కనిపిస్తూ వీరు మీడియాకు మంచి మేత అందించారు. అయితే, వరల్డ్ కప్ సందర్భంగా కోహ్లీ వైఫల్యాలకు అనుష్కను బాధ్యురాలిని చేశారు విమర్శకులు. ఆమె మ్యాచ్ లకు హాజరవడంతోనే కోహ్లీ ఏకాగ్రత తప్పిందని విశ్లేషించారు. దీనిపై కోహ్లీ, అనుష్క పెద్దగా స్పందించకున్నా, సీనియర్ నటి, పంజాబ్ ఫ్రాంచైజీ సహ యజమాని ప్రీతీ జింతా మాత్రం స్పందించింది. కోహ్లీ వైఫల్యాలకు అనుష్కను బాధ్యురాలిని చేస్తున్న విమర్శకులు, కోహ్లీ విజయాలకు కూడా ఆమెను బాధ్యురాలిగా పరిగణించాలంది. అందుకే, కోహ్లీ ఎప్పుడైనా రాణించి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిస్తే, అతని తరపున అనుష్క వెళ్లి ఆ అవార్డు తీసుకోవాలని గట్టి సలహా ఇచ్చింది. కష్టాల్లో ఉన్న ప్రేమికుడికి మద్దతుగా నిలిచిన అమ్మాయిని కుళ్లు జోకులతో వేధించడం వింతగా ఉందని పేర్కొంది. సెలబ్రిటీలను ఈ విధంగా బాధించడం అనైతికమని అభిప్రాయపడింది.