: గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ అధ్యక్షుడిగా మైనంపల్లి ఏకగ్రీవ ఎన్నిక
గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ అధ్యక్షుడిగా మైనంపల్లి హనుమంతరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన పేరును ఉపముఖ్యమంత్రి మహమ్మూద్ అలీ ప్రతిపాదించగా, మంత్రులు పద్మారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ బలపరిచారు. మంత్రి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ఎన్నిక ప్రక్రియ జరిగింది. తెలంగాణ భవన్ లో జరిగిన ఎన్నికల కార్యక్రమానికి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల మంత్రులు, పలువురు టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు.