: చెన్నైలో ఆయన ఇల్లు ఓ పుణ్యక్షేత్రమే: అమితాబ్ బచ్చన్


బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ ఇటీవల చెన్నై వెళ్లారు. అప్పుడప్పుడూ సినిమా షూటింగులు, ఇతర కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అక్కడికే వెళ్లే ఆయన ఈసారి మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు. అందుకు ప్రధాన కారణం నాటితరం లెజండరీ నటుడు శివాజీ గణేశన్ ఇంటిని సందర్శించడమే! అంతేకాదు, తమిళులు తనపై చూపిన అభిమానానికి బిగ్ బీ ముగ్దుడైపోయారట. "సినిమాల కోసం గత 40 ఏళ్లుగా నేను చెన్నై వస్తూనే ఉన్నా. శివాజీ గారు నటించిన ఓ తమిళ చిత్రానికి రీమేక్ గా రూపొందించే హిందీ సినిమా షూటింగ్ కోసం డబ్బయవ దశకంలో మొదటిసారి ఇక్కడికి వచ్చాను. అప్పటి నుంచి నేను శివాజీ సర్ కు గొప్ప అభిమానిని" అని బిగ్ బి తెలిపారు. ఈ క్రమంలో ఈసారి టీ నగర్ లోని శివాజీ గణేశన్ ఇంటిని కూడా అమితాబ్ సందర్శించారు. అంతేకాదు, ఆయన కుమారుడు, నటుడు ప్రభు, ఆయన కుటుంబ సభ్యులతో కలసి విందు కూడా చేశారు. అందుకుగానూ ప్రభుకు కృతజ్ఞతలు తెలిపిన బిగ్ బి, "గతంలో ఈ ఇంట్లో నాకు ఎన్నో జ్ఞాపకాలున్నాయి. కానీ ఈరోజు ఈ ఇంటిని సందర్శించడం నాకు గౌరవంగా ఉంది. దీనిని నేను ఓ పుణ్యక్షేత్రంలా భావిస్తున్నా" అని పేర్కొన్నారు. అక్కడి ప్రజలు తనపై చూపిన అభిమానం, ప్రేమ చాలా అద్భుతమని, బాలీవుడ్ నటులను కూడా ఇక్కడ గుర్తించి, అభిమానించడం చాలా బాగుందని తెలిపారు. అందరికీ ధన్యవాదాలు చెబుతున్నానన్నారు.

  • Loading...

More Telugu News