: లండన్ ఎన్నికల ప్రచారంలో బిజీగా అభిషేక్ బచ్చన్
లండన్ ఎన్నికల కోసం అభిషేక్ బచ్చన్ బిజీగా ప్రచారం చేస్తున్నాడు. అవును, తన మిత్రుడు, లేబర్ పార్టీ నుంచి ఎంపీగా బరిలో ఉన్న భారత సంతతి వ్యక్తి కీత్ వాజ్ కు ఓట్లేయాలని చెబుతూ వీధుల్లో తిరుగుతున్నాడు. కీత్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించేందుకు వెళ్లిన ఆయన లీసెస్టర్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నాడు. అక్కడున్న పీపుల్స్ ప్లాజాలో జరిగిన సభలో పాల్గొన్న ఆయన 350 మందితో సమావేశమై వారడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. తరువాత కీత్ తో కలసి బెల్ గ్రేవ్ రోడ్డులో ప్రచారం చేశాడు. తమ అభిమాన నటుడు అభిషేక్ ను చూసేందుకు భారత సంతతి ప్రజలు, అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు.