: నెహ్రూకిచ్చిన భారతరత్న వెనక్కి తీసుకోవాలి: నేతాజీ మనవడు
నేతాజీ సుభాష్ చంద్రబోస్ బంధువులపై నిఘా వేసినట్టు వార్తలు రావడం దేశంలో కలకలం రేపింది. దీనిపై బోస్ మనవడు చంద్రబోస్ స్పందించారు. ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ... సుభాష్ చంద్రబోస్ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. చరిత్రకారులు అభిప్రాయాలు కలిగివుండవచ్చని, కానీ, చరిత్రను వక్రీకరించడం తగదని హితవు పలికారు. ఈ క్రమంలో ఆయన ఓ అడుగు ముందుకేసి, నెహ్రూకిచ్చిన భారతరత్నను వెనక్కి తీసుకోవాలన్నారు. నెహ్రూ వ్యక్తిత్వం ఎలాంటిదో ఇప్పుడు బాగా తెలుస్తోందని అన్నారు.