: యూపీఏ 'చిన్న విమానాశ్రయాల నిర్మాణం' ప్రాజెక్టును అటకెక్కించిన మోదీ సర్కారు!


దేశంలోని చిన్న, మధ్యతరహా పట్టణాల్లో విమానాశ్రయాలు నిర్మించాలన్న ఉద్దేశంతో యూపీఏ ప్రవేశపెట్టిన లో-కాస్ట్ ఎయిర్ పోర్ట్స్ ప్లాన్ ను ప్రస్తుతానికి నిలిపివేయాలని మోదీ సర్కారు నిర్ణయించింది. ఈ పథకం 2013లో కార్యరూపంలోకి రాగా, ఇప్పటికే పనులు ప్రారంభమైన చోట్ల మాత్రం వాటిని కొనసాగించాలని ఎన్డీఏ భావిస్తోంది. వాణిజ్య పరంగా లాభాలు నమోదుకావడం కష్టమన్న ఉద్దేశంతోనే చిన్న విమానాశ్రయాల అభివృద్ధిని నిలిపినట్టు పౌర విమానయాన శాఖ అధికారి ఒకరు తెలిపారు. కేవలం 5 చిన్న విమానాశ్రయాల్లో మాత్రమే పనులు జరుగుతున్నాయని వివరించారు. 10 లక్షల మందికి పైగా జనాభా ఉంటేనే చిన్న విమానాశ్రయాలు నడుస్తాయని ఆయన తెలిపారు. వీటి నిర్మాణానికి ఉచితంగా లేదా అతి తక్కువ ధరకు రాష్ట్ర ప్రభుత్వాలు భూమిని అందించాల్సి వుంటుందని, రూ. 100 కోట్ల నుంచి రూ. 150 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి భవన, రన్ వే నిర్మాణాలు చేపట్టాలని ఆయన తెలిపారు. పలు ప్రాంతాల్లో భూ సేకరణ సమస్యలున్నందున కూడా లో-కాస్ట్ ఎయిర్ పోర్టుల నిర్మాణ ఆలోచన పక్కనబెట్టామని పేర్కొన్నారు. కాగా, 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 44 నగరాలు 10 లక్షలకు పైగా జనాభాతో ఉండగా, వాటిల్లో 13 చోట్ల విమానాశ్రయాలు లేవు.

  • Loading...

More Telugu News