: పోలీసు నిర్లక్ష్యంపై మహిళ నిరసన... నల్లకుంట పీఎస్ ఎదుట ఆత్మహత్యాయత్నం
హైదరాబాదు పోలీసుల నిర్లక్ష్యంపై ఓ మహిళ నిరసనకు దిగింది. భర్త వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు వస్తే, పోలీసులు స్పందించలేదట. ఆపై ఫిర్యాదు కూడా తీసుకోలేదట. దీంతో మనోవేదనకు గురైన సదరు బాధితురాలు పోలీస్ స్టేషన్ ఎదుటే ఆత్మహత్యాయత్నం చేసింది. నగరంలోని నల్లకుంట పోలీస్ స్టేషన్ వద్ద కొద్దిసేపటి క్రితం చోటుచేసుకున్న ఈ ఘటనలో నాగలక్ష్మీ అనే మహిళ తీవ్ర గాయాలపాలైంది. సదరు మహిళ ఆత్మహత్యాయత్నం చేసిన తర్వాత కాని స్పందించని పోలీసులు, ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.