: సోనియాపై వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ క్షమాపణ


కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ శరీర రంగుపై చేసిన వ్యాఖ్యలకుగానూ కేంద్ర సహాయమంత్రి గిరిరాజ్ సింగ్ క్షమాపణ చెప్పారు. ఎవరినీ బాధపెట్టాలన్న ఉద్దేశం తనకు లేదని లోక్ సభలో వివరణ ఇచ్చారు. ఒకవేళ తన వ్యాఖ్యలు ఎవరి భావాలనైనా బాధపెట్టి ఉంటే తాను విచారం వ్యక్తం చేస్తున్నానని గిరిరాజ్ తెలిపారు. దాంతో ఈ వివాదం ముగిసింది. ఈ నెల మొదట్లో మీడియాతో మాట్లాడిన గిరిరాజ్, "ఒకవేళ రాజీవ్ గాంధీ తెల్లతోలు మహిళను (సోనియాగాంధీ) కాకుండా నైజీరియన్ మహిళను వివాహం చేసుకుని ఉంటే ఆమె నాయకత్వాన్ని కాంగ్రెస్ అంగీకరించేదా?" అని వ్యాఖ్యానించారు. దాంతో రాజకీయ వర్గాల్లో ఈ మాటలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఈరోజు లోక్ సభలో కాంగ్రెస్ ఈ వ్యాఖ్యలపై తీవ్ర నిరసన వ్యక్తం చేసి సోనియాకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి.

  • Loading...

More Telugu News