: లివింగ్ స్టన్ వరల్డ్ రికార్డ్... 138 బంతుల్లో 34 ఫోర్లు, 27 సిక్స్ ల సాయంతో 350 పరుగులు
ప్రపంచ క్రికెట్ చరిత్రలో మరో రికార్డు బద్దలైంది. ఇంగ్లండ్ లో ల్యాంక్ షైర్, క్లాడీ టీముల మధ్య ఒక రోజు క్లబ్ క్రికెట్ పోటీలు జరుగగా, ల్యాంక్ షైర్ ఆటగాడు లియామ్ లివింగ్ స్టన్ 138 బంతుల్లో ఏకంగా 350 పరుగులు రాబట్టడంతో 45 ఓవర్లలో ఆ జట్టు 579 పరుగులు చేయగలిగింది. ఏ ఫార్మాట్ లో నైనా ఒక రోజు క్రికెట్ పోటీల్లో వ్యక్తిగత రికార్డు ఇదే. ఇంతకుముందు ఈ రికార్డు హైదరాబాద్ కుర్రాడు నిఖిలేష్ సుందరేశన్ పేరిట ఉంది. 2008లో జరిగిన ఓ స్కూల్ మ్యాచ్ లో భాగంగా, తన 15 ఏళ్ల వయసులో నిఖిలేష్ 334 పరుగులు చేశాడు. ఇప్పుడా రికార్డును లివింగ్ స్టన్ బద్దలు కొట్టాడు.