: కోర్టుకు శేషాచలం మృతుల పోస్టుమార్టం నివేదిక... తదుపరి విచారణ ఎల్లుండికి వాయిదా
శేషాచలం ఎన్ కౌంటర్ లో మృతి చెందిన తమిళ కూలీల మొదటి పోస్టుమార్టం నివేదికను ఏపీ ప్రభుత్వం ఈరోజు హైకోర్టుకు సమర్పించింది. ఈ కేసులో రీ పోస్టుమార్టానికి సంబంధించిన వివరాల నివేదికను బుధవారానికల్లా అందజేయాలని కోర్టు ప్రభుత్వానికి సూచించింది. తదుపరి విచారణను న్యాయస్థానం ఎల్లుండికి వాయిదా వేసింది. ఈ నెల మొదటివారంలో శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో 20 మంది తమిళ కూలీలు మరణించిన సంగతి తెలిసిందే. ఎన్ కౌంటర్ ను తమిళనాడు పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి కూడా.