: వైసీపీ సహాయంతోనే గెలిచా... ఏపీ మంత్రి అయ్యన్న సంచలన వ్యాఖ్య


సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిన ఏపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి, టీడీపీ తొలితరం నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు కొద్దిసేపటి క్రితం మరోమారు పార్టీలో వేడి పుట్టించే వ్యాఖ్యలు చేశారు. గడచిన ఎన్నికల్లో తాను వైసీపీ సహాయం తీసుకుని విజయం సాధించానని ఆయన పేర్కొన్నారు. తన సొంత నియోజకవర్గం నర్సీపట్నం కార్యకర్తల సమావేశంలో భాగంగా కొద్దిసేపటి క్రితం ఆయన చేసిన వ్యాఖ్యలు టీడీపీలో పెను దుమారాన్నే రేపనున్నాయి. ఎన్నికల్లో తనకు వెన్నుపొటు పొడిచేందుకు సొంతపార్టీ నేతలు యత్నించారని ఆయన ఆరోపించారు. మూడు రోజుల్లో ఎన్నికలనగా విషయం తెలుసుకుని, అప్పటికప్పుడు విజయం కోసం పక్కాగా స్కెచ్ వేసుకున్నానని చెప్పారు. ఈ క్రమంలో వైసీపీ సహాయం అర్థించానన్నారు. తాను అడిగిన వెంటనే సహాయం చేసి తనను గెలిపించిన ప్రతిపక్ష నేతలను టీడీపీ కార్యకర్తలు గౌరవించాల్సిందేనని చెప్పుకొచ్చారు. ఈ మేరకు కార్యకర్తలు నడుచుకోని పక్షంలో తానే సదరు విపక్ష సభ్యులను గౌరవించడం మొదలుపెడతానని కూడా ఆయన హెచ్చరించారు.

  • Loading...

More Telugu News