: ఇదో పెద్ద వసపిట్ట... మనవరాలు ఆరాధ్యపై అమితాబ్
మనవరాలి ముద్దుముద్దు మాటలను చూసి మురిసిపోతున్నాడు బిగ్ బీ అమితాబ్. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్ ల గారాలపట్టీ, మూడేళ్ల ఆరాధ్య వసపిట్టని, ఆగకుండా మాట్లాడుతూనే ఉంటుందని తన బ్లాగ్ లో పొంగిపోయాడు. ఆరాధ్య వయసును మించిన మెచ్యూరిటీ చూపిస్తోందని ఆనందపడుతున్నాడు. ఇంట్లో జరిగే కబుర్లను మనవరాలు ఆరాధ్య నోట విని ఆనందిస్తున్నట్టు 72 ఏళ్ల తాత అమితాబ్ అంటున్నారు. ఊహించేందుకు కూడా వీలులేని ప్రశ్నలను సంధిస్తోందని, ఈ సమయంలో ఆరాధ్యతో కలిసి వుండడం తన జీవితంలోనే అత్యుత్తమ సమయమని ఆయన తెలిపారు.