: ‘రాజు’ సోదరులకు చుక్కెదురు... హైకోర్టుకెళ్లమన్న నాంపల్లి కోర్టు
సత్యం కంప్యూటర్స్ కేసులో దోషులుగా తేలిన రామలింగరాజు, ఆయన సోదరుడు రామరాజులకు నాంపల్లి చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో చుక్కెదురైంది. తమకు ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేయాలన్న రాజు సోదరుల పిటిషన్ ను కొద్దిసేపటి క్రితం సీఎంఎం కోర్టు న్యాయమూర్తి కొట్టివేశారు. ఈ కేసులో తదుపరి చర్యలు తీసుకునే పరిధి తనది కాదని పేర్కొన్న న్యాయమూర్తి, హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్లకు సూచించారు. ఈ నేపథ్యంలో రాజు సోదరులు హైకోర్టును ఆశ్రయించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం.