: తమిళనాడులో ఎర్రచందనం డంపులు... జల్లెడ పడుతున్న చిత్తూరు పోలీసులు


శేషాచలం అడవుల నుంచి అక్రమ మార్గాల్లో తరలిపోతున్న ఎర్రచందనం దుంగలకు తమిళనాడు స్టోరేజ్ సెంటర్ గా మారుతోంది. శేషాచలం ఎన్ కౌంటర్ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల మధ్య పెరిగిన విభేదాలను రూపుమాపేందుకు రంగంలోకి దిగిన ఏపీ పోలీసులు అసలు వాస్తవాలను వెలికి తీస్తున్నారు. ఇప్పటికే ఎర్రచందనం స్మగ్లింగ్ లో తమిళనాడుకు చెందిన రాజకీయ, సినీ రంగ ప్రముఖులున్నట్లు ఏపీ పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. తాజాగా చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో తమిళనాడులో జరుగుతున్న సోదాల్లో 4 టన్నుల మేర ఎర్రచందనం పట్టుబడింది. ఎర్రచందనాన్ని విదేశాలకు తరలించే క్రమంలో దుంగలను తమిళనాడుకు తరలిస్తున్న స్మగ్లర్లు, అక్కడే నిల్వ చేస్తున్నట్లు ఈ సోదాల్లో తేటతెల్లమైంది.

  • Loading...

More Telugu News