: సద్దాం హుస్సేన్ హయాంలోనే ఐఎస్ఐఎస్ కు బీజం... జర్మనీ పత్రిక సంచలన కథనం


ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఐఎస్ఐఎస్ కు బీజాలు ఇరాక్ నియంత నేత సద్దాం హుస్సేన్ హయాంలోనే పడ్డాయని, ఆయన ప్రధాన అనుచరుడు, ఇంటెలిజన్స్ హెడ్ గా పనిచేసిన సమీర్ మహమ్మద్ అల్-ఖలీఫా అలియాస్ హాజీ బకర్ నేతృత్వంలో ఐఎస్ కు రూపకల్పన జరిగిందని జర్మనీకి చెందిన ఓ పత్రిక సంచలన కథనాన్ని ప్రచురించింది. ఉత్తర సిరియాపై ఆధిపత్యం కోసం ఐఎస్ బ్లూప్రింట్ను ఆయన సిద్ధం చేశాడని జర్మనీ వార పత్రిక 'డిర్ స్పీగల్' తెలిపింది. కాగా, జనవరి 2014లో హాజీ బకర్ ను సిరియా వ్యతిరేక దళాలు కాల్చి చంపిన సంగతి తెలిసిందే. సిరియా ఉత్తర ప్రాంతంలో 'కాలిఫేట్' ఏర్పాటు, గూఢచర్య కార్యకలాపాలు, హత్యలు, కిడ్నాప్ లకు ఆయన ప్రణాళికలు రూపొందించాడని పేర్కొంది. 2006 నుంచి 2008 మధ్య అమెరికా సైన్యం అధీనంలో బుక్కా, అబూ ఘారైబ్ జైల్లో ఉన్న ఆయన, ఆ సమయంలో జీహాదీలతో సంబంధాలు పెంచుకున్నారని, కొందరు ఇరాకీ సైన్యాధికారులూ ఆయనకు సహకరించారని తెలిపింది. ఈ కథనం ఇప్పుడు సంచలనం కలిగిస్తోంది.

  • Loading...

More Telugu News