: లోక్ సభ రెండోదశ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం
లోక్ సభ రెండో దశ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ముందుగా ఇటీవల మృతి చెందిన సింగపూర్ మాజీ అధ్యక్షుడు లీ క్వాన్ యూకు సభ సంతాపం వ్యక్తం చేసింది. అంతేగాక ఛత్తీస్ గఢ్ లోని సుకుమా, దంతెవాడల్లో మావోయిస్టుల దాడుల్లో మరణించిన జవానుల మృతి పట్ల కూడా లోక్ సభ సంతాపం వ్యక్తం చేసింది. నిమిషం పాటు మౌనం వహించి అందరికీ నివాళులర్పించారు. ఆ వెంటనే సభలో భూ సేకరణ చట్టసవరణ బిల్లుపై చర్చ జరగనుంది. విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ సుమిత్రా మహాజన్ తిరస్కరించారు. చర్చ చేపట్టాల్సిందేనని విపక్షాలు పట్టుబడుతున్నాయి.