: వైద్యుడు కాదు... నపుంసక దయ్యం!... సుదీర్ఘ లేఖ రాసి, ఆత్మహత్య చేసుకున్న ఎయిమ్స్ వైద్యురాలు


ఢిల్లీలోని అత్యంత ప్రముఖ ఆసుప్రతుల్లో ఒకటైన ఎయిమ్స్ లో వైద్యుడిగా పనిచేస్తున్న పేరున్న సీనియర్ డాక్టర్ కమల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్ట్ వెనుక కారణాలు పరిశీలిస్తే, దిగ్ర్భాంతి కలుగుతోంది. భార్య ప్రియ మరణానికి ఈ వైద్యుడి పైశాచికత్వమే కారణమని తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఎయిమ్స్ లో అనస్థీషియా నిపుణురాలిగా పనిచేస్తున్న ప్రియకు, డెర్మటాలజిస్ట్ గా పనిచేస్తున్న కమల్ తో ఐదేళ్ల క్రితం వివాహం కాగా, దక్షిణ ఢిల్లీలోని ఎయిమ్స్ క్వార్టర్స్ లో నివాసం ఉంటున్నారు. భర్త పెడుతున్న అపరిమితమైన మానసిక హింసను తట్టుకోలేకనే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు లేఖ రాసి పెట్టి, తన చేతి మణికట్టును కోసుకుని ప్రియ మరణించింది. పెళ్లయిన తరువాత కమల్ నపుంసకుడని తెలిసినా సర్దుకుపోయానని, కానీ, పరిస్థితిని తాను చనిపోయేవరకూ తీసుకువచ్చాడని సుదీర్ఘ లేఖ రాసింది. భర్తతో ఘర్షణ పడిన తర్వాత ప్రియ ఇంటి నుంచి వచ్చేసి, సెంట్రల్ ఢిల్లీలోని ఓ హోటల్ లో దిగింది. అదే రోజు తన భార్య కనిపించడం లేదని భర్త చేసిన ఫిర్యాదుతో, హోటళ్లలో వెతికిన పోలీసులకు ఆమె ఆ హోటల్ లో శవమై కనిపించింది. తాను 'గే'నన్న విషయాన్ని కమల్ దాచిపెట్టాడని, కట్నం కోసం వేధించాడని ఆమె ఆరోపించింది. ఆమె చనిపోయే ముందు ఫేస్ బుక్ ఖాతాలో ఒక పోస్ట్ పెడుతూ "నేను నీతోనే ఉండాలని అనుకున్నాను. ఎందుకంటే నేను నిన్ను ఎంతో ప్రేమించాను కాబట్టి. నీ లోపాన్ని కూడా భరించాను. కానీ, నువ్వు నా జీవితానికి ఓ క్రిమినల్ గా మారావు. నీ కుటుంబానికి ఈ విషయాలు తెలీవు. నువ్వో దయ్యానివి" అని రాసింది. ఆమె రాసిన సూసైడ్ నోట్ ఆధారంగా కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు వివరించారు.

  • Loading...

More Telugu News