: విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు హోస్పిర, మైలాన్ సంస్థల ఆసక్తి
అమెరికాకు చెందిన హోస్పిర, మైలాన్ సంస్థలు విశాఖలో బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఈ మేరకు ఆ సంస్థల ప్రతినిధులు హైదరాబాదులోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఏపీలో పెట్టుబడులపై వారితో బాబు చర్చించారు. హోస్పిర సంస్థ 2,500 కోట్ల పెట్టుబడికి ఆసక్తి చూపగా, మైలాన్ సంస్థ ఐదు బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేసింది.