: తైవాన్ లో భూకంపం... జపాన్ లో సునామీ హెచ్చరికలు జారీ
తైవాన్ లో నేటి ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.6 గా నమోదైన ఈ భూకంపం కారణంగా జరిగిన నష్టం వివరాలు వెల్లడి కాలేదు. భూకంపం ధాటికి తైవాన్ రాజధాని తైపీలో పలు భవంతులు కంపించినా పెద్దగా నష్టమేమీ జరగలేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ భూకంపం తీవ్రత 6.6గా అమెరికా జియాలజికల్ సంస్థ చెబుతున్నా, వాస్తవానికి దాని తీవ్రత 6.8గా ఉందని జపనీస్ అధికారులు చెబుతున్నారు. తైవాన్ లోని హువాలియాన్ కు తూర్పు దిశగా 71 కిలో మీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు వారు తెలిపారు. తైవాన్ లో భూకంపం నేపథ్యంలో జపాన్ లో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. రేడియో ద్వారా హెచ్చరికలు జారీ చేసిన జపాన్ ప్రభుత్వం, సముద్రానికి వీలయినంత దూరంగా ఉండాలంటూ ప్రజలకు సూచించింది.