: 7 సెకన్లలో గ్లాసు దించకుండా బీరు పీకిన ఆస్ట్రేలియా ప్రధాని!
చుట్టూ చేరిన అధికారులు, అభిమానులు చప్పట్లతో ప్రోత్సహిస్తుంటే, ఏడంటే ఏడే సెకన్లలో గ్లాసు బీరును లాగించేశారు ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్. రూల్స్ ఫుట్ బాల్ క్లబ్ ఆటగాళ్లు సిడ్నిలోని ఒక బార్లో విందు ఇవ్వగా, దానికి హాజరైన అబాట్ ఆహూతుల హర్షధ్వానాల మధ్య గ్లాసు దించకుండా బీరు తాగేశారు. అబాట్ బీరుని తాగిన దృశ్యం కెమెరా కంటికి చిక్కగా, ఇప్పుడా చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి. టోనీ తీరు అక్కడ ఉన్నవారికి ఆనందాన్నిస్తే, ఆస్ట్రేలియాలో అమితంగా మద్యం సేవిస్తున్నారని, ఆ అలవాటు తగ్గించుకోవాలని సూచనలు ఇచ్చే ప్రధానే స్వయంగా అందరి ముందు తాగడం ఏంటని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.