: అధికారుల 'లీల'తో 747 సంవత్సరాలు బతికిన హరిసింగ్!
అసలు మనిషి ఎంతకాలం బతుకుతాడు? మహా అయితే ఓ 70 నుంచి 80 ఏళ్లు... ఇంకా ఆరోగ్యవంతులైతే 100 సంవత్సరాలు. చాలా అరుదుగా 125 ఏళ్ల వరకూ బతికిన వారున్నారు. కానీ, మీరట్ లో 200 నుంచి 700 ఏళ్లకు పైగా బతికిన వారు ఎందరో ఉన్నారు. అధికారుల నిర్లక్ష్యంతో ఒటరు గుర్తింపు కార్డుల్లో దొర్లిన తప్పులను పరిశీలిస్తే ఔరా అనిపించక మానదు. మీరట్ పరిధిలోని సుభాష్ నగర్లో హరిసింగ్ అనే వ్యక్తికి ఏకంగా 747 ఏళ్లని రాసేశారు. మరో చోట కొడుకు వయసు 112 సంవత్సరాలని, ఆయన తండ్రి వయసు 72 సంవత్సరాలని రాశారు. ఆ ప్రాంతంలో ప్రస్తుతం ఓటరు కార్డుల్లో తప్పుల సవరణ జరుగుతోందని, అన్ని తప్పులూ సరిచేస్తామని అధికారులు చెబుతున్నారు.