: నేనున్నా... లేకున్నా...!: కేసీఆర్ వ్యాఖ్యలతో బరువెక్కిన కళాకారుల హృదయాలు!


తెలంగాణ కళాకారుల సమ్మేళనంలో సీఎం కేసీఆర్ భావోద్వేగపూరిత వ్యాఖ్యలు చేశారు. ‘‘నేనున్నా... లేకున్నా... తెలంగాణలో ఉండేది మీరే’’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సమ్మేళనానికి హాజరైనవారిని కలవరానికి గురి చేశాయి. అంతేకాక వెనువెంటనే కేసీఆర్ వ్యాఖ్యలను అడ్డుకునేందుకు ప్రభుత్వ సలహాదారు రమణాచారి చేసిన యత్నం కూడా ఫలించలేదు. ‘‘సార్, మీరు అలా మాట్లడొద్దు. మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి’’ అని రమణాచారి అంటున్నా, ఆయనను వారించిన కేసీఆర్ తనదైన శైలిలో ప్రసంగాన్ని కొనసాగించారు. ‘‘ఇప్పుడు నాకు 61 ఏళ్లు. నాకు వేరే కోరికలు ఏమీ లేవు. నా జీవితకాలపు కోరిక ప్రత్యేక తెలంగాణ. అది నెరవేరింది. తెలంగాణ కోసం పోరాడిన నువ్వు ఎక్కడికి పోతావని ప్రజలు ముఖ్యమంత్రి పదవి ఇచ్చి కట్టేశారు. నేను ఉన్నా, లేకున్నా తెలంగాణలో ఉండేవారు మీరే’’ అని కేసీఆర్ అన్నారు.

  • Loading...

More Telugu News