: బర్త్ డే ‘బాబు’కు గ్రీటింగ్స్ వెల్లువ... బాలయ్య ఇంటికి వెళ్లిన చంద్రబాబు
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన ఇంటిలో నేటి ఉదయం సందడి వాతావరణం నెలకొంది. ఏపీ కేబినెట్ మంత్రులు చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. మంత్రులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, రావెల కిశోర్ బాబు, కొల్లు రవీంద్ర, శిద్ధా రాఘవరావు తదితరులు చంద్రబాబు ఇంటికి వచ్చి మరీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. టీటీడీ, శ్రీకాళహస్తీశ్వరాలయాల నుంచి తరలివచ్చిన వేదపండితులు చంద్రబాబుకు ఆశీర్వచనాలు పలికారు. ఆ తర్వాత చంద్రబాబు నేరుగా తన బావ, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇంటికి వెళ్లారు. చంద్రబాబు బర్త్ డే నేపథ్యంలో నిన్న రాత్రి హైదరాబాదులోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ విద్యుద్దీప కాంతులతో మెరిసిపోయింది.