: నిలకడగా ముంబై ఇండియన్స్ బ్యాటింగ్


రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ బ్యాట్స్ మెన్ నిలకడగా ఆడుతున్నారు. ముంబై జట్టు 12 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 101 పరుగులు చేసింది. టాస్ గెలిచిన బెంగళూరు ఫీల్డింగ్ ఎంచుకోగా, ముంబై ఓపెనర్ సిమ్మన్స్ (51 బ్యాటింగ్) క్రీజులో పాతుకుపోయాడు. మరో ఓపెనర్ పార్థివ్ పటేల్ 12 పరుగులకే అవుట్ కాగా, ఉన్ముక్త్ చాంద్ (28 బ్యాటింగ్) తో కలిసి సిమ్మన్స్ ఇన్నింగ్స్ నడిపిస్తున్నాడు. ఆరోన్ విసిరిన ఇన్నింగ్స్ 11వ ఓవర్లో ఈ కరీబియన్ ఆటగాడు ఓ సిక్స్, రెండు ఫోర్లు బాదడం విశేషం. అటు, చాంద్ కూడా ధాటిగా ఆడడంతో ముంబై 11.5 ఓవర్లలో సెంచరీ మార్కు చేరుకుంది. పిచ్ సహకరించకపోవడంతో బెంగళూరు బౌలర్లు మరో వికెట్ తీసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. బంతి చక్కగా బ్యాట్ పైకి వస్తుండడంతో ముంబై ఆటగాళ్లకు పెద్దగా ఇబ్బందులు ఎదురుకాలేదు.

  • Loading...

More Telugu News