: మురళీమోహన్ ఏదేదో మాట్లాడారు... అయినా గౌరవం ఉంది: నాగేంద్రబాబు


మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం చేసింది. ఈ కార్యక్రమం అనంతరం నటుడు, నిర్మాత నాగేంద్రబాబు మాట్లాడుతూ, 'మా' ఎన్నికలకు ముందు మురళీమోహన్ ఏదేదో మాట్లాడారని విమర్శించారు. అయితే, ఆయనంటే తమకు గౌరవం ఉందని అన్నారు. చిత్ర పరిశ్రమ రాజకీయాలకు అతీతంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా నాగబాబు పేద ఆర్టిస్టుల పింఛను కోసం మెగా ఫ్యామిలీ నుంచి రూ.6 లక్షల విరాళం ప్రకటించారు. అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ... 'మా'కు మురళీమోహన్ ఆశీస్సులు అవసరమని పేర్కొన్నారు. ఎన్నికల్లో విజయం కిక్ ఇచ్చిందన్నారు. అంతకుముందు, మురళీమోహన్ మాట్లాడారు. ఎన్నికల్లో పోటీ పడినా తామంతా ఒక్కేటనని ఉద్ఘాటించారు. ఇకపై అందరం కలిసికట్టుగానే సాగుతామని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News