: రైతులను అడ్డుపెట్టుకుని రాజకీయాలా?: వెంకయ్య మండిపాటు
కాంగ్రెస్ చేపట్టిన కిసాన్ ర్యాలీని ఉద్దేశించి బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. ఇవాళ కాంగ్రెస్ నిర్వహించింది కిసాన్ ర్యాలీ కాదని, రాజకీయ ర్యాలీ అని విమర్శించారు. రైతులను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తారా? అని ప్రశ్నించారు. భూసేకరణ చట్టంపై కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించారు. ఆర్డినెన్స్ పై సందేహాలు, అపోహలు తలెత్తడంతో 9 సవరణలు చేశామని, అయితే, కాంగ్రెస్ ఈ విషయంలో ప్రజలను తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ చౌకబారు విమర్శలు చేయడం తగదన్నారు. అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను కేంద్రం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.