: ప్రమాణస్వీకారం చేసిన 'మా' నూతన కార్యవర్గం


మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) నూతన కార్యవర్గం నేడు ప్రమాణస్వీకారం చేసింది. మురళీమోహన్ కొత్త కార్యవర్గంతో ప్రమాణస్వీకారం చేయించారు. "గద్దే బాబూ రాజేంద్రప్రసాద్ అనే నేను మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ 2015-17కు అధ్యక్షుడిగా నా బాధ్యతలు స్వీకరిస్తున్నాను" అంటూ 'నటకిరీటి' పగ్గాలు అందుకున్నారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రతిష్ఠకు భంగం కలిగించే ఏ పని చేయబోనని, సంఘం నిర్వహించే అన్ని కార్యక్రమాలకు సహాయపడతానని ప్రమాణస్వీకారంలో భాగంగా పేర్కొన్నారు. ఇతర కార్యవర్గ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు అనేకమంది విచ్చేశారు.

  • Loading...

More Telugu News