: కోహ్లీ వర్సెస్ రోహిత్ శర్మ... విజేత ఎవరో?


ఐపీఎల్ లో మరో ఆసక్తికర మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగే ఈ పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబయి ఇండియన్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. బెంగళూరు జట్టుకు విరాట్ కోహ్లీ నాయకత్వం వహిస్తుండగా, ముంబై జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఇద్దరు టీమిండియా ఆటగాళ్లు కెప్టెన్లుగా అమీతుమీకి సిద్ధం కావడంతో వారి నాయకత్వ లక్షణాలకు ఈ మ్యాచ్ పరీక్ష పెట్టనుంది. ఇక, విధ్వంసక శక్తులు క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్ బరిలో ఉండడంతో మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతుందని భావిస్తున్నారు. టాస్ గెలిచిన బెంగళూరు జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది.

  • Loading...

More Telugu News