: చెన్నైకి తొలి ఓటమి... రాయల్స్ కు అడ్డేలేదు!


ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. చెన్నై సూపర్ కింగ్స్ తో అహ్మదాబాదులోని మొతేరా స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో రాయల్స్ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఓపెనర్లు రహానే (76 నాటౌట్), వాట్సన్ (73) చెలరేగడంతో 157 పరుగుల విజయలక్ష్యాన్ని 18.2 ఓవర్లలో ఛేదించింది. బ్రావో, జడేజా చెరో వికెట్ తీశారు. అంతకుముందు, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 156 పరుగులు చేసింది. బ్రావో (62*) టాప్ స్కోరర్. కాగా, టోర్నీలో చెన్నై జట్టుకిది తొలి ఓటమి కాగా, ఇప్పటివరకు ఐదు మ్యాచ్ లాడిన రాజస్థాన్ రాయల్స్ అన్నింటా నెగ్గి విజయ పరంపర కొనసాగిస్తోంది.

  • Loading...

More Telugu News