: కడప సెంట్రల్ జైల్లో చెట్టుకు ఉరేసుకుని ఖైదీ ఆత్మహత్య
కడప సెంట్రల్ జైల్లో ఈరోజు విషాదం చోటుచేసుకుంది. కారాగారం ఆవరణలోని చెట్టుకు ఓ ఖైదీ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కృష్ణమూర్తి అనే ఈ ఖైదీ విగతజీవుడిలా చెట్టుకు వేలాడుతుండడాన్ని గమనించారు. కృష్ణమూర్తి భార్య ఆత్మహత్య కేసులో శిక్ష అనుభవిస్తున్నాడు. జైలు ఆవరణలో ఘటన జరగడంతో ఖైదీలు, జైలు అధికారులు దీని గురించే చర్చించుకుంటున్నారు. ఖైదీ ఆత్మహత్యకు దారితీసిన కారణాలను తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.