: ముగిసిన ఎన్నికలు... ఏపీ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడిగా సీఎం రమేశ్


ఏపీ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడిగా సీఎం రమేశ్ ఎన్నికయ్యారు. కార్యదర్శిగా జేసీ పవన్ రెడ్డి ఎన్నికయ్యారు. హైదరాబాదులో నేడు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఒలింపిక్ సంఘాలకు ఎన్నికలు నిర్వహించారు. ఏపీకి సీఏం రమేశ్, తెలంగాణ ఒలింపిక్ సంఘానికి అధ్యక్షుడిగా జితేందర్ రెడ్డి ఎన్నికయ్యారు. తెలంగాణ ఒలింపిక్ సంఘం కార్యదర్శిగా దేవీశ్వర్ యాదవ్ ఎన్నికయ్యారు. శాప్ నుంచి ఎస్వీ రమణ అబ్జర్వర్ గా వచ్చారు. జస్టిస్ వర్మ ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించారు. ఆయనే ఎన్నికల ఫలితాలను ప్రకటించారు. అటు, తానే ఏపీ ఒలింపిక్ సంఘానికి అధ్యక్షుడినని ఎంపీ గల్లా జయదేవ్ ప్రకటించుకోవడంతో గందరగోళం నెలకొంది. ఇప్పుడీ ఎన్నిక ద్వారా రాజ్యసభ సభ్యుడు సీఏం రమేశ్ ఏపీ ఒలింపిక్ సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నికవడం ఆసక్తికరంగా మారింది. కాగా, జయదేవ్, రమేశ్ ఇద్దరూ టీడీపీ నేతలు కావడంతో ఈ వ్యవహారంలో పార్టీ అధినేత చంద్రబాబు జోక్యం చేసుకోవచ్చని తెలుస్తోంది. ఇద్దరినీ కూర్చోబెట్టి రాజీ కుదిర్చేందుకు ఆయన ప్రయత్నించే అవకాశాలున్నాయి.

  • Loading...

More Telugu News