: రూ.93 లక్షలు పలికిన 'టైటానిక్' కుర్చీ
ప్రపంచంలోనే అద్భుత నిర్మాణంగా పేరుగాంచిన టైటానిక్ నౌక, విషాదకరమైన రీతిలో నీటమునగడం అప్పట్లో అందరినీ కలచివేసింది. 1912లో నౌక సౌతాంప్టన్ నుంచి న్యూయార్క్ వెళుతుండగా భారీ మంచు దిబ్బను ఢీకొంది. ఈ ఘటనలో దాదాపు 1500 మంది సముద్ర జలాల్లో ప్రాణాలు విడిచారు. ఈ సందర్భంగా మృతదేహాల కోసం అన్వేషిస్తున్న సహాయక బృందాలకు ఓ కుర్చీ దర్శనమిచ్చింది. ఇప్పుడా కుర్చీని వేలం వేశారు. ఇంగ్లండ్ లోని హెన్రీ ఆల్డ్రిడ్జ్ అండ్ సన్ అనే సంస్థ నిర్వహించిన వేలంలో ఓ వ్యక్తి ఆ కుర్చీని లక్ష పౌండ్లు (రూ.93 లక్షలు) వెచ్చించి దక్కించుకున్నాడు. ఆ కుర్చీ నాన్ టాకే కలపతో తయారైంది. వందేళ్ల క్రితం తయారైనా ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉందట.