: ఉన్నోళ్ల కోసం కాదు మేముంది!: కేసీఆర్


తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు హైదరాబాదు మాదాపూర్ లోని తెలంగాణ సాంస్కృతిక సారథి కార్యాలయంలో జరిగిన కళాకారుల శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ... తమ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. తామున్నది ఉన్నోళ్ల కోసం కాదని అన్నారు. తెలంగాణ సంక్షేమం కోసం దీర్ఘకాలిక ప్రణాళికలు రచిస్తున్నామని తెలిపారు. ఏపీలో కలిసేనాటికే తెలంగాణలో 20 లక్షల ఎకరాలకు నీరందేదని, గతంలో చెరువుల ద్వారానే 15 లక్షల ఎకరాలు సాగయ్యేవని వివరించారు. మిషన్ కాకతీయతో తెలంగాణలోని చెరువులకు పూర్వవైభవం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో 300 కోట్ల మొక్కలను నాటడం లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. బంగారు తెలంగాణలో కళాకారులు కూడా భాగస్వాములు కావాలని కేసీఆర్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమంలో కళాకారుల సేవలు మరువలేనివని కొనియాడారు. కళాకారులు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండడం హర్షణీయమన్నారు. ఉద్యమానికి కళాకారులు అందించిన సహకారంతో పోల్చితే ఉద్యోగం ఏపాటిదీ కాదని అభిప్రాయపడ్డారు. కళాకారులకు హెల్త్ ఇన్స్యూరెన్స్ కార్డులిస్తామని సభాముఖంగా హామీ ఇచ్చారు. తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ 'రసమయి' బాలకిషన్ ఆధ్వర్యంలో ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

  • Loading...

More Telugu News