: సీఎం రమేశ్ కు క్రీడల్లో ఏబీసీడీలు కూడా తెలియవు: ఏపీఓఏ వ్యవస్థాపక అధ్యక్షుడు
ఏపీ ఒలింపిక్ సంఘం వ్యవహారం గందరగోళంగా తయారైంది. అటు, సంఘానికి తానే అధ్యక్షుడినని ఎంపీ గల్లా జయదేవ్ ఇప్పటికే ప్రకటించుకోగా, ఇటు సీఎం రమేశ్ ఏపీ ఒలింపిక్ సంఘానికి ఎన్నికలు నిర్వహించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో, ఏపీ ఒలింపిక్ సంఘం (ఏపీఓఏ) వ్యవస్థాపక అధ్యక్షుడు కోదండరామయ్య రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. సీఎం రమేశ్ కు క్రీడల్లో ఏబీసీడీలు తెలియవని ఎద్దేవా చేశారు. ఆయనకు అసలు క్రీడలపై అవగాహనే లేదని అన్నారు. ఏపీ ఒలింపిక్ సంఘానికి ఏప్రిల్ 4వ తేదీనే ఎన్నికలు జరిగాయని, ఈ ఎన్నికలకు ఇండియన్ ఒలింపిక్ సంఘం ప్రతినిధులు పరిశీలకులుగా వచ్చారని చెప్పారు.