: లగేజీకి బీమా... ఐఆర్సీటీసీ కొత్త సదుపాయం


ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) ప్రయాణికులకు మరో సదుపాయం కల్పిస్తోంది. ఐఆర్సీటీసీ వెబ్ సైట్ ద్వారా ఇ-టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులకు ఇకపై లగేజీ బీమా సౌకర్యం లభించనుంది. ల్యాప్ టాప్, మొబైల్ ఫోన్ తదితర విలువైన వస్తువులు ఈ బీమా పరిధిలోకి వస్తాయి. ఆయా వస్తువులు చోరీకి గురయితే ఈ బీమా సదుపాయం వర్తింపజేస్తారు. ఇందుకోసం ఐఆర్సీటీసీ... న్యూ ఇండియా అస్యూరెన్స్ సంస్థతో చర్చలు జరుపుతోంది. దీనిపై ఓ రైల్వే అధికారి మాట్లాడుతూ... ఈ బీమా సౌకర్యం ఐచ్ఛికమని, ప్రయాణికుడు కోరుకుంటే కల్పిస్తామని, తప్పనిసరి కాదని అన్నారు. ప్రయాణ దూరాన్ని బట్టి ఇన్స్యూరెన్స్ ప్రీమియం ఆధారపడి ఉంటుందని చెప్పారు.

  • Loading...

More Telugu News