: ముగిసిన సంగీత దర్శకుడు శ్రీ అంత్యక్రియలు


అనారోగ్యంతో కన్నుమూసిన సంగీత దర్శకుడు శ్రీనివాస చక్రవర్తి అంత్యక్రియలు ముగిశాయి. హైదరాబాదు టోలీచౌకీలోని మహాప్రస్థానం శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. అభిమానులు, బంధుమిత్రులు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. అంతకుముందు, ఆయన భౌతికకాయానికి సంగీత దర్శకులు కోటి, రఘు కుంచె, కీరవాణి సోదరుడు కల్యాణ్ కోడూరి, గాయని స్మిత తదితరులు నివాళులర్పించారు. శ్రీతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రసిద్ధ గాయకుడు మనో మాట్లాడుతూ, శ్రీ మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని అన్నారు. శ్రీ మంచి గాయకుడు కూడా అని కొనియాడారు.

  • Loading...

More Telugu News