: మధ్యదరా సముద్రంలో బోటు మునక... వందలమంది జలసమాధి!
వలస కూలీలను మోసుకెళుతున్న ఓ భారీ బోటు మధ్యదరా సముద్రంలో మునిగిపోయింది. పలు అంతస్తులున్న ఈ బోటులో 700 మంది ఉన్నట్టు తెలిసింది. ఇప్పటివరకు 28 మందిని ఇటలీ కోస్టుగార్డులు కాపాడారు. 23 మృతదేహాలు లభ్యమయ్యాయి. గల్లంతైన వారికోసం ఇటలీ, మాల్టా దళాలు గాలిస్తున్నాయి. లిబియా తీరానికి ఉత్తరంగా లాంపెడూసా దీవికి సమీపంలో ఘటన జరిగింది. ప్రమాదానికి గురైన బోటులో పరిమితికి ఎన్నోరెట్లు మించి కూలీలు ఎక్కారు. ప్రయాణం మధ్యలో ఓ వాణిజ్య నౌక దృష్టిని ఆకర్షించేందుకు కూలీలు ప్రయత్నించడంతో బోటు అదుపుతప్పి మునిగిపోయినట్టు 'ద టైమ్స్ ఆఫ్ మాల్టా' దినపత్రిక పేర్కొంది. ఆఫ్రికా ఖండం నుంచి ప్రతి ఏడాది యూరప్ దేశాలకు పెద్ద ఎత్తున ప్రజలు అక్రమ మార్గాల్లో వెళుతుండడం తెలిసిందే.