: బలమైన ప్రతిపక్షం ఉంటే బాగుండేది... బీజేపీ చర్చాగోష్ఠిలో ప్రధాని మోదీ


ప్రధాని నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటులో బలమైన ప్రతిపక్షం ఉండి ఉంటే బాగుండేదని ఆయన వ్యాఖ్యానించారు. తద్వారా ఆయన కాంగ్రెస్ ను బలహీన ప్రతిపక్షంగా చెప్పకనే చెప్పారు. మొన్నటి ఎన్నికల్లో పదో వంతు సీట్లను కూడా గెలుచుకోలేని కాంగ్రెస్ కు లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చేందుకు మోదీ సర్కారు ససేమిరా అంది. కాంగ్రెస్ పార్టీకి మొండిచేయి చూపడానికి గతంలో జరిగిన ఘటనలను కూడా వెతికింది. తాజాగా మూడు దేశాల పర్యటనను ముగించుకుని వచ్చిన మోదీ, కొద్దిసేపటి క్రితం ఢిల్లీలో ప్రారంభమైన బీజేపీ చర్చాగోష్ఠిలో మాట్లాడారు. కెనడాతో యురేనియం సరఫరాకు సంబంధించి కుదిరిన ఒప్పందంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News