: మాదే నిజమైన ఎన్నిక... ‘ఒలింపిక్’ వివాదంపై నోరు విప్పిన గల్లా జయదేవ్
ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఇప్పటికే ఎన్నికైనట్లు ప్రకటించుకున్న గుంటూరు ఎంపీ, ప్రముఖ పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ ఎట్టకేలకు ఈ వివాదంపై నోరు విప్పారు. తిరుపతి వేదికగా ఈ నెల 4న జరిగిన ఎన్నికల్లో తాను అధ్యక్షుడిగా, పురుషోత్తం కార్యదర్శిగా ఎన్నికయ్యామని ఆయన కొద్దిసేపటి క్రితం ఓ టీవీ ఛానెల్ తో మాట్లాడుతూ వెల్లడించారు. తిరుపతిలో తమను ఎన్నుకునేందుకు జరిగిన ఎన్నికలే నిజమైనవని కూడా ఆయన పేర్కొన్నారు. భారత ఒలింపిక్ సంఘం ప్రతినిధి సమక్షంలో నాటి ఎన్నిక జరిగిందని, అందుకే తమదే నిజమైన కార్యవర్గమని ఆయన వాదించారు.