: భారత్ సహనాన్ని పరీక్షించవద్దు... హఫీజ్ కు తొగాడియా వార్నింగ్!
పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ జమాత్ ఉద్ దవా అధినేత హఫీజ్ సయాద్ కు విశ్వ హిందూ పరిషత్ నేత ప్రవీణ్ భాయ్ తొగాడియా వార్నింగిచ్చారు. భారత్ సహనాన్ని పరీక్షించవద్దని తొగాడియా... హఫీజ్ తో పాటు పాకిస్థాన్ సర్కారుకు తీవ్ర హెచ్చరికలు చేశారు. కాశ్మీర్ లో వేర్పాటువాదానికి తాము ఊతమిస్తున్నామని ఇటీవల హఫీజ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చర్యల ద్వారానే కాశ్మీర్ కు భారత్ నుంచి విముక్తి కలుగుతుందని కూడా అతడు వ్యాఖ్యానించాడు. దీనిపై నిన్న అలహాబాదులో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా తొగాడియా ఆగ్రహం వ్యక్తం చేశారు.