: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం... ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురి దుర్మరణం
తమిళనాడులో నేటి ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కృష్ణగిరి జిల్లా ఊట్టంకరై వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. కృష్ణగిరి నుంచి తిరువణ్ణామలై వెళుతున్న ఓ కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని నలుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు సహా ఏడుగురు మృత్యువాత పడ్డారు. ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన మరో వ్యక్తిని పోలీసులు హుటాహుటీన ఆస్పత్రికి తరలించారు.