: సీఎం రమేశ్ వర్సెస్ గల్లా జయదేవ్... వేడెక్కిన ఏపీ ఒలింపిక్స్ రాజకీయం


ఏపీ ఒలింపిక్స్ అసోసియేషన్ ఎన్నికలు అధికార పార్టీ టీడీపీ లో ఇద్దరు కీలక నేతల మధ్య అగ్గి రాజేశాయి. ఇప్పటికే జరిగిన ఎన్నికల్లో తాను ఒలింపిక్ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యానని గుంటూరు ఎంపీ, ప్రముఖ పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ చెబుతున్నారు. అయితే ఆ ఎన్నికను పరిగణనలోకి తీసుకోని టీడీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్, తాను ఏకగ్రీవంగా ఎన్నికయ్యానని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇరువురు నేతల మధ్య విభేదాలు తార స్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో నేడు హైదరాబాదులోని బంజారా ఫంక్షన్ హాల్ లో ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ భేటీ జరుగుతోంది. ఈ భేటీకి సీఎం రమేశ్ నేతృత్వం వహించనున్నారని విశ్వసనీయ సమాచారం. అయితే ఇప్పటికే అధ్యక్షుడిగా ఎన్నికైన గల్లా జయదేవ్ పరిస్థితి ఏమిటని ఆయన వర్గం నేతలు ప్రశ్నిస్తున్నారు. దీంతో నేటి భేటీపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

  • Loading...

More Telugu News