: వరంగల్ కళాకారులతో ఆడి పాడిన డిగ్గీరాజా!
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జి దిగ్విజయ్ సింగ్ నిన్న పదం పాడారు. కదం తొక్కారు. ఢిల్లీ వచ్చిన వరంగల్ కళాకారులతో కలిసి ఆయన తెలంగాణ సంప్రదాయ నృత్యాలు చేశారు. పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో నేడు పార్టీ నిర్వహించనున్న కిసాన్ ర్యాలీలో పాలుపంచుకునేందుకు పెద్ద ఎత్తున తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలు నిన్న ఢిల్లీ చేరుకున్నారు. రెండు నెలల అనంతరం రాహుల్ ఢిల్లీ వచ్చారన్న సంతోషంలో వరంగల్ కళాకారులు అక్కడ ఆటపాటలతో సందడి చేశారు. ఇది చూసిన డిగ్గీరాజా, తనను తాను నిలువరించుకోలేకపోయారు. కళాకారులతో గళం కలపడమే కాక కాలూ కదిపారు. కళాకారులతో కలిసి స్టెప్పులేశారు. దీంతో మరింత ఉత్సాహం వచ్చేసిన కళాకారులు తమ ఆటపాటలతో పార్టీ కార్యాలయం ముందు హోరెత్తించారు.